పశు వైద్యశాల కార్యాలయానికి తాళం..!

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాల సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే మూతపడింది. పశువైద్యాధికారులు కార్యాలయంలో ఉండకుండా తాళాలు వేసుకుని త్వరగానే ఇంటికి వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరవడంతో తరచూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.