పోయిన బ్రాస్లెట్ బాధితుడికి అప్పగింత

పోయిన బ్రాస్లెట్ బాధితుడికి అప్పగింత

విజయనగరంలో ఓ పోలీస్ అకాడమీ విద్యార్థి సీతారాం దొరికిన 2 తులాల బంగారు బ్రాస్లెట్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితుడు మస్తాన్‌ పోలీస్ స్టేషన్‌ను సోమవారం సంప్రదించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిర్ధారణ చేసి బాధితుడికి బ్రాస్లెట్‌ను అందజేశారు. అనంతరం విద్యార్థి సీతారాంను సీఐ సత్కరించారు.