సందడిగా ఫ్రెండ్స్‌హాకీ టోర్నమెంట్
విశాఖ నగరంలోని బుల్లయ్య కాలేజీ గ్రౌండ్‌లో ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాకీ టోర్నమెంట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. అసోసియేషన్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ రవిశంకర్ తెలిపారు. ముఖ్య అతిథి జి. మధుకుమార్ అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. పోటీల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.