అర్జీలు స్వీకరించిన నెల్లూరు కలెక్టర్
NLR: సీతారాంపురం మండలం మారంరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సుడిగాలి పర్యటన చేపట్టారు. అనంతరం సచివాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి అధిక సంఖ్యలో అర్జీలు వెల్లువెత్తాయి. వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.