ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా?: రేణు దేశాయ్
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. 'ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా? లేక ఉగ్రవాదులా? మమ్మల్ని ఎందుకు అంతగా బూతులు తిడుతున్నారు?' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కళాకారులు చాలా సున్నితమైన వారని, వారి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఎందుకు హింసిస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఈ రకమైన నెగెటివిటీని ఆపాలని నెటిజన్లను కోరింది.