2030కి మరో 25 లక్షల ఉద్యోగాలు

2030కి మరో 25 లక్షల ఉద్యోగాలు

దేశీయ ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లో 2030 నాటికి 20-25 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అడెకో ఇండియా నివేదిక వెల్లడించింది. ఆసుపత్రులు, ఫార్మా, టెలిమెడిసిన్, క్లినికల్ రీసెర్చ్ వంటి విభాగాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. అయితే, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా 30-35% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు అవసరమని, వారికే ప్రాధాన్యత ఉంటుందని వివరించింది.