జిల్లాతో నాదెండ్ల భాస్కర రావుకు ప్రత్యేక అనుబంధం
KMM: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఖమ్మం రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నేతగా గుర్తింపు పొందారు.