'ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి'

VZM: ఈ నెల 7,8 తేదీలలో రాజాంలో జరుగనున్న CITU జిల్లా మహా సభలకు హాజరుకావాలని జిల్లా అధ్యక్షులు శంకరరావు కోరారు. మంగళవారం వంగర PHC వద్ద ఆశా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ భద్రత, పేస్కేల్, కనీస వేతనం, రిటైర్డ్‌మెంట్ సదుపాయాలు, వంటి సమస్యలపై జరగనున్న జిల్లా మహాసభలకు హాజరు అవ్వాలని సూచించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు