ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి
గద్వాల జిల్లా మానవపాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీసీ కాలనీకి చెందిన కార్తీక్ నాయుడు (4) తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఎస్సై చంద్రకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.