రేపు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ
VKB: తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప దేవాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కుటుంబీకులు ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు, కార్యకర్తలు, భక్తులందరూ ఈ పూజలో పాల్గొని, అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు.