పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
GNTR: 2006 మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. పొన్నూరు మండల ఎంఈఓ కే. విజయ భాస్కర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 30వ తేదీ లోపు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆలస్య రుసుము డిసెంబర్ 1 నుంచి 5 వరకు రూ. 50, 6 నుంచి 10 వరకు రూ. 200, 11 నుంచి 15 వరకు రూ. 500 చెల్లించే అవకాశాలున్నాయని తెలిపారు.