అలంపూర్ ఆలయం వద్ద నిలిచిన పడవ ప్రయాణాలు

GDWL: అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల వద్ద తుంగభద్ర నదిలో పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈరోజు ఎస్సై వెంకటస్వామి పడవ ప్రయాణాలను నిలిపివేయించి, నది సమీపంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.