జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

TG: మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం గత 9 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. రాజగోపురంలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 42,800 క్యూసెక్కుల వరద నీరు పొంగిపొర్లుతోంది. గర్భగుడి ముందున్న మూడు పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న నాలుగు పాయలు కలిసి ఒకే పాయగా మంజీర నది ప్రవహిస్తోంది.