రైతులకు పత్తి విత్తనాల ఇక్కట్లు

సంగారెడ్డి: జిల్లాలో పత్తి రైతులకు కష్టాలు తప్పేలా లేవు. జిల్లా వ్యాప్తంగా 3.60 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపుగా 7.2 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవగా, ఇప్పటికి మార్కెట్‌లో 4,47,332 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. 1,37,444 ప్యాకెట్లు విక్రయించారు. దీంతో రైతులు సరిపడ విత్తనాలను అందించాలని కోరుతున్నారు.