VIDEO: నీట మునిగిన లంక గ్రామాలు

కోనసీమ: భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు నీట మునిగాయి. గురజాపులంక, కూనాలంక గ్రామాల్లో ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లంక వాసులు తమ అవసరాల కోసం పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.