కాల్వ పూడికతీత పనులకు శంకుస్థాపన

NTR: నందిగామ పట్టణంలోని కేవీఆర్ కాలేజ్ కాల్వకట్ట నుంచి నేషనల్ హైవే 65 వరకు NSP కాల్వ పూడికతీత పనులకు శుక్రవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులు పూర్తవ్వగానే వర్షాకాలంలో నీటి పారుదల సమస్యలు తీరుతాయని, పట్టణ ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.