ఈనెల 10న ఇల్లందకుంట రామాలయ హుండీ లెక్కింపు
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి సుధాకర్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని చెప్పారు. హుండీ లెక్కింపులో పాల్గొనదలిచిన భక్తులు డ్రెస్ కోడ్‌ను పాటించాలన్నారు.