దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇంట్లో చోరీ
MHBD: కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన పాతూరి అనసూర్య ఇంటికి తాళం వేసి తెలిసిన వారి ఇంటికి పడుకోవడానికి వెళ్లింది. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 6 తులాల బంగారు, 17తులాల వెండి ఆభరణాలు, రూ.600 నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు.