ప్రతిభ చాటిన విద్యార్థులు
VKB: మండల స్థాయిలో నిర్వహించిన ఇంగ్లీష్ అలోకేషన్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ పోటీలలో మోత్కుపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. ఆనంద్, షానవాజ్, మజీద్లు మొదటి స్థానంతో సత్తా చాటగా, సాయి తేజ రెండవ స్థానం సాధించాడు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.