'జై అమరావతి' అంటూ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన
కోనసీమ: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై కపిలేశ్వరపురం మండలం వల్లూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 'జై అమరావతి' అంటూ శనివారం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ మాట్లాడుతూ.. రాజధానిపై స్పష్టత రావడం శుభసూచకం అన్నారు.