మంగళ రూపినిగా శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు

మంగళ రూపినిగా శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారు

CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా మంగళ రూపిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయాన్నే అమ్మవారి శిల విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలు, నిమ్మకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన హారంతో అమ్మవారిని మంగళ రూపినిగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.