సహకార సంఘానికి ఆప్కాబ్ అవార్డు

SKLM: ఆముదాలవలసకు చెందిన కృష్ణాపురం పీఎసీఎస్‌కు ఆప్కాబ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఛైర్మన్ శిమ్మ మాధవి విజయవాడలో రాష్ట్ర మంత్రి అచ్చంనాయుడు చేతుల మీదుగా సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహకార రంగంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.