వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఆమదాలవలస ఎమ్మెల్యే

SKLM: సురక్షితమైన త్రాగునీరు ప్రజలకు అందజేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వెల్లడించారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టెక్కి వలస పురపాలక సంఘం ప్రభుత్వ పాఠశాలలో ఓ ప్రయివేటు బ్యాంక్ సహకారంతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. త్రాగునీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు.