ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి: హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల కొరత లేకుండా చూడాలని, ఆసుపత్రిలో పారిశుధ్యాన్ని కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. స్కానింగ్, ల్యాబ్ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని సూచించారు.