పడుకునే ముందు పుస్తకం చదవితే..!
పడుకునే ముందు పుస్తకం చదవడం మానసిక ఆరోగ్యానికి, మంచి నిద్రకు చాలా అవసరం. ఈ-బుక్స్‌కు బదులు ప్రింటెడ్ పుస్తకాలు ఎంచుకోవడం ఉత్తమం. పుస్తకం చదవడం వల్ల ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి(Blue Light) ప్రభావం తగ్గి, నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పట్టడానికి ముందు 20-30 నిమిషాలు చదివితే సులువుగా నిద్రలోకి జారుకోవచ్చు.