శిథిలావస్థలో వ్యవసాయ కార్యాలయం

VKB: కుల్కచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయ భవనం శిథిలావస్థలో ఉంది. తేలిక పాటి వర్షానికే కురుస్తుంది. దీంతో ఏవో కార్యాలయాన్ని రైతు వేదికలోకి తరలించారు. విషయం తెలియక ఇక్కడికి వచ్చే రైతులు మూసి ఉన్న కార్యాలయాన్ని చూసి ఇబ్బందులు పడుతున్నారు. ఏవో కార్యాలయ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని మండల రైతులు కోరుతున్నారు.