నిఘా వేసి రూ.15 లక్షల రేషన్ బియ్యం పట్టివేత
NLR: మనుబోలు మండలం జాతీయ రహదారిపై కాగితాలు పూర్ క్రాస్ రోడ్ వద్ద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రూ.14.70 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి చెన్నై వెళ్తున్న లారీలో 700 బస్తాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా నిఘా వేసి పట్టుకున్నారు.