VIDEO: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం: MLA నాగరాజు
HNK: రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. హన్మకొండ జిల్లా పెగడపల్లి సొసైటీ పరిధిలోని పలువురు రైతులకు నానో యూరియా వాడకంపై నేడు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. నానో యూరియా వాడకం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.