లబ్ధిదారుడి ఇంట్లో మంత్రి, కలెక్టర్, మేయర్ భోజనం

లబ్ధిదారుడి ఇంట్లో మంత్రి, కలెక్టర్, మేయర్ భోజనం

HYD: నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీ పథకం పెదోడికి వరం అని అన్నారు. మంత్రితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఖైరతాబాద్ నేత విజయ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.