'గ్రామాల్లో ప్రజలకు ధ్యానంపై అవగాహన లేదు'
MBNR: హన్వాడ మండలం దాచేపల్లి గ్రామంలో మహేషా పిరమిడ్ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్యానం ద్వారా లభించే ఆధ్యాత్మిక మానసిక ప్రయోజనాలు ప్రతి ఇంటికి చేరాలన్నారు. గ్రామాలలో ఇంకా ధ్యానం గురించి, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు పూర్తిగా తెలియదని పేర్కొన్నారు.