ఆర్యవైశ్యుల శోభాయాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

ఆర్యవైశ్యుల శోభాయాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

WGL: ఈనెల 7న వైశాఖ శుద్ధ దశమి వాసవిమాత జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆర్యవైశ్యులు కోరారు. శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు వారు ఆవిష్కరించారు. వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మ దేవాలయం నుంచి రామన్నపేటలోని వాసవిమాత దేవాలయం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుందన్నారు. ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.