11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే ?
JGL: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్ లోని 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 11 గంటల వరకు 47.63 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పలు కీలక గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు.