గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు

గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు

PLD: దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలోని పాడుబడిన బావిలో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహానికి ఆదివారం స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజులు మార్చురీలో భద్రపరిచినా ఎటువంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం ఇచ్చారు. ట్రస్ట్ సభ్యులు కమిటీతో కలిసి అంత్యక్రియలు జరిపించారు.