'భక్తులకు అసౌకర్యం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలి'

RR: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కమలానగర్‌లో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల పరిసర ప్రాంతాల భక్తులకు అసౌకర్యం కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సూపర్ వైజర్ రాజ్ కుమార్‌కు తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.