'బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలి'
గుంటూరులో బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణపై శనివారం సదస్సు జరిగింది. మహిళా-శిశు సంక్షేమ శాఖ పీడీ ప్రసూన మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థల సహకారం కీలకమన్నారు. పిల్లలకు జీవించే హక్కు, రక్షణ, అభివృద్ధి, భాగస్వామ్య హక్కులు కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.