ఉమ్మడి ఖమ్మంలో ఆమెదే పై చేయి
ఉమ్మడి ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీలో మొత్తం 1,93,833 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,01,164 మంది మహిళలు ఉన్నారు. బరిలో ఉన్న 953 మంది అభ్యర్థులు 473 మంది మహిళలే కాగా.. ఏడు ఛైర్మన్ పీఠాల్లో ఆరు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. అభ్యర్థుల గెలుపోవటములను మహిళ ఓటర్ల శాసించనున్నారు.