రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

KMM: ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణారెడ్డి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన కృష్ణారెడ్డిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.