VIDEO: పన్ను కట్టని దుకాణాలు సీజ్
NZB: బోధన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ప్రాపర్టీ టాక్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని పలు వాణిజ్య సముదాయాలను అధికారులు సీజ్ చేశారు. వర్తకులు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.