మహిళా భద్రత, బాలికల రక్షణపై అవగాహన

మహిళా భద్రత, బాలికల రక్షణపై అవగాహన

MNCL: మంచిర్యాలలోని ఓ పాఠశాలలో శుక్రవారం షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, బాలికల రక్షణ, వేధింపుల నివారణ, తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్సై ఉషారాణి మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, ఈవ్ టిజింగ్, అసభ్య ప్రవర్తనలు లాంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్ కృషి చేస్తోందని తెలిపారు.