VIDEO: గన్నవరం చేరుకున్న కేంద్ర బృందం

VIDEO: గన్నవరం చేరుకున్న కేంద్ర బృందం

కృష్ణా: రాష్ట్రంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం గుంటూరు, కృష్ణా, బాపట్ల, NTR జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించనుంది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై వివరాలు సేకరించారు.