వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌కు రిమాండ్
ATP: సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న అనంతపురానికి చెందిన వైసీపీ కన్వీనర్ అశోక్‌ను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీడీపీ నాయకురాలు జెట్టి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు.