VIDEO: పిడుగు పడి ఎద్దు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మహాముత్తారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో బుధవారం పిడుగు పడి ఎద్దు మరణించింది. పోచంపల్లి గ్రామంలో లావుడియా పొగి నాయక్ కు చెందిన ఎద్దు చేనులో మేత మేస్తోంది. పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించినట్లు రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.