ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కల వాగు
NLR: ఏఎస్ పేట శివారులోని నక్కల వాగులో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో, పోలీసులు బ్రిడ్జి వద్ద నిశితంగా పరిశీలిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువైనప్పుడు వాహనదారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల కారణంగా గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సమాచారం అందించాలని సూచించారు.