మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

MNCL: దండేపల్లి మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు తేదీని ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రామగిరి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 7, 8, 9, 10వ తరగతిలో మిగులు సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని అయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.