జలమండలి ఎండీని కలిసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే

జలమండలి ఎండీని కలిసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే

RR: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీఎన్ రెడ్డినగర్, మన్సూరాబాద్, హయత్‌నగర్ డివిజన్లలో కొనసాగుతున్న ట్రంక్ లైన్ సమస్యను వివరించారు. సాగర్ కాంప్లెక్స్ కల్వర్టు నుంచి హరహరపురం డ్రైనేజీ ఛాంబర్ వరకు కలపడానికి షార్ట్ టెండర్ల ద్వారా తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.