VIDEO: మామిడిపల్లిలో కొనసాగుతున్న ఉత్సవాలు
NZB: మక్లూర్ మండలం మామిడిపల్లిలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం సుప్రభాతం, మండప ఆరాధన, యాగశాల ప్రవేశం నిర్వహించినట్లు శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు. అలాగే సాయంత్రం పూజా హోమం, విగ్రహాల ధాన్యాధివాసం, మంత్రప్రోక్షణ, హారతి జోలపాట, ఆశీర్వచనం ఉంటుందన్నారు.