ప్రజా దర్బార్‌లో ప్రజా సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే
BPT: బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తమ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వివిధ పిర్యాదులు, వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.