మురికి కాలువలో పడి యువకుడు మృతి
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దినసరి కార్మికుడుగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ (25) అనే యువకుడు మురికి కాలువలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రెండవ బైపాస్ రహదారిలోని బుధవారం అర్ధరాత్రి మురికి కాల్వలో బైక్‌తో పాటు పడి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడు బద్ది పోచమ్మ ఆలయంలో దినసరి కార్మికుడిగా పని చేశాడు.