VIDEO: 'ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం'
NTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని, రక్తదానం ప్రాణాలను రక్షించే గొప్ప సేవ అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.