ఆకట్టుకుంటున్న 'బూంగ్' ట్రైలర్
మణిపురి చిత్రం 'బూంగ్' బాఫ్టా 2026 అవార్డుల్లో సత్తా చాటింది. 'బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్' కేటగిరీలో విజేతగా నిలిచి, ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ వేదికపై ప్రాంతీయ సినిమా సత్తా చాటిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశారు.